Header Banner

మాటల్లోనే బంధం… చేతల్లో మాత్రం “పవర్ ఆఫ్ అటార్నీ! జగన్‌పై షర్మిల తీవ్ర విమర్శలు!

  Sat Apr 05, 2025 07:18        Politics

మాజీ సీఎం, తన సోదరుడు వైఎస్‌ జగన్‌ను తిట్టడం కోసమే తాను రాజకీయాల్లో కొనసాగడంలేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. ‘‘రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను రాజకీయాల్లో ఉన్నాను. కానీ, దీనికి భిన్నంగా నా విషయంలో కవరేజీ ఇస్తున్నారు. ఇది బాధాకరం.’’ అని ఆమె తెలిపారు. ఆస్తుల పంపకాల విషయంలో స్వయంగా ఎంవోయూపై జగన్‌ సంతకం చేశారని, ఆస్తుల్లో ఎవరికి ఏవి చెందాలనేది స్పష్టంగా అందులో పేర్కొన్నారని షర్మిల వివరించారు. కానీ, వాటిని ఇంతవరకూ ఇవ్వలేదని తెలిపారు. ‘‘గిఫ్ట్‌ను ఆయన విజయమ్మకు ఇచ్చారు. నాకు ఇవ్వలేదు. ఇచ్చిన షేర్లను జగన్‌ వెనక్కి అడుగుతున్నారు. ఇది సొంత తల్లికి కుమారుడు చేస్తున్న మోసం.’’ అని ఆమె వాపోయారు. తల్లిమీద కేసు పెట్టినవాడిగాను, ఆస్తులు కాజేయడానికి సొంత మేనల్లుడు,మేనకోడలినే మోసం చేసిన మేనమామగాను జగన్‌ చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్! పార్టీని విడిచిపోతున్న కీలక నేత!


విజయవాడ ఆంధ్రరత్నభవన్‌లో శుక్రవారం విలేకరులతో షర్మిల మాట్లాడారు. తన హయాంలో నరేంద్ర మోదీకి జగన్‌ దత్తపుత్రుడు అన్నట్టు వ్యవహరించారని మండిపడ్డారు. మోదీ అనాడు రాష్ట్రం నోట్లో మట్టి కొట్టారని, ఇప్పుడు సున్నం కొట్టడానికి తిరిగి అమరావతికి ఆయన వస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చంపేస్తోందని ఆమె ఆరోపించారు. ‘‘పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేయడంవల్ల అది బ్యారేజీ స్థాయికి పరిమితం అవుతుంది. కేవలం ఎత్తిపోతల పథకంగానే మిగిలిపోనుంది. ఇలాంటి ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమిటి? సహాయ, పునరావాస ప్యాకేజీని ఎగ్గొట్టేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఎత్తు వేసింది. 85 వేలమంది నిర్వాసితులకు అన్యాయం చేసింది. అయినా, కూటమినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌; వైసీపీ అధినేత జగన్‌ కూడబలుక్కున్నట్లుగా మౌనంగా ఉన్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్వేతపత్రం విడుదల చేయాలి.’’ అని షర్మిల డిమాండ్‌ చేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #SharmilaVsJagan #FamilyFeud #PoliticalDrama #YSRFamilyRift #SharmilaFiresOnJagan